ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సెలవు తీసుకున్నారు. ఈ క్రమంలో జెన్‌కో సీఎండీగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ట్రాన్స్‌కో సీఎండీగా జేఎండీ శ్రీనివాస్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరిద్దరూ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.