ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు.
కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్ ర్యాంక్.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు, అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు.
ఐదేళ్ల లా కోర్సుల్లో
►మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా.
►సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి, బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా.
►మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా.
►నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం.
►అయిదో ర్యాంక్- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా.