ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు

తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు.

ఈ సదస్సులో పాల్గొనాలనుకునే వారు ఈనెల 28లోగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040-27654347, 6309111427 ఫోన్ నెంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంలో దేశీయ ఆవుల ఆవశ్యకత, దేశీయ విత్తనాలను కాపాడుకోవడం, ఐదు వరుసల పంటల పద్ధతి, తదితర విషయాలపై వక్తలు అవగాహన కల్పిస్తారని వివరించారు.