యాదాద్రి విరాళాల కోసం క్యూఆర్‌కోడ్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయల ఈవో ఎన్‌ గీత తెలిపారు. భక్తులు తమ ఫోన్‌లోని గూగుల్‌, ఫోన్‌పే, పేటీఎం ద్వారా క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేసి, కానుకలను ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలో సమర్పించవచ్చునని సూచించారు. స్వామివారికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ యాదగిరిగుట్ట బ్రాంచ్‌ ఖాతాలో ఇప్పటివరకు రూ.1,06,14,315 నగదు జమ అయిందని తెలిపారు. దీంతోపాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హుండీ కూడా ఏర్పాటుచేశారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక అనుమతులు తీసుకొన్నామని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. బంగారు కానుకలు, నగదు విరాళాల స్వీకరణ నిమిత్తం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.