శాంతమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ మరణంపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. శాంతమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ.. హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్‌గర్ పట్టణంలోని వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.