హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్ మండలాల్లో భారీ సంఖ్యలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ కొంత నెమ్మదిగా కొనసాగుతున్నది.
కాగా, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నదని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వీణవంకలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. రాత్రి 7 గంటలలోపు పోలింగ్ బూత్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.
బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 8.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది.