హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో భారీగా పోలింగ్‌..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 76.26శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్లు వేసేందుకు మరో రెండు గంటల సమయం ఉండడంతో పోలింగ్‌ శాతం మరింత పెరుగనున్నది. దాదాపు 90 శాతానికిపైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటలకు ముగియనున్నది. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నది. ఇదిలా ఉండగా.. కమలాపూర్‌ పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు.