ఏసీబీకి చిక్కిన విద్యుత్తు ఏఈ

విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ.2 వేలు లంచం తీసుకొంటూ విద్యుత్తు సబ్‌ ఇంజినీర్‌ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుకు చెందిన గుజ్జా రామకృష్ణ తన చికెన్‌ దుకాణంలో విద్యుత్తు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దుకాణంలో అదనపు లోడ్‌ ఉందని.. అందుకోసం రూ.2 వేలు లంచం ఇవ్వాలని ఎన్‌పీడీసీఎల్‌ కార్యాలయంలో సబ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న చింతల గోవర్ధన్‌.. రామకృష్ణను డిమాండ్‌చేశాడు. దీంతో రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఏస్పీ ఎస్వీ రమణమూర్తి పథకం ప్రకారం శనివారం సాయం త్రం బచ్చోడు విద్యుత్తు కార్యాలయంపై దాడి చేశారు. రామకృష్ణ నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా గోవర్ధన్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.