దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ రీసెర్చ్‌ (SAFAR) పేర్కొంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 302గా నమోదైందని పేర్కొన్నది. రాబోయే రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్‌ పేర్కొంది. ఈ నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం అంచనా వేసింది. 4వ తేదీ వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయిలో ఉండి.. 5-6 తేదీల్లో గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది.