మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పొలేపల్లి ఫార్మా సెజ్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న అరబిందో ఫార్మా కంపెనీలోని బాయిలర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. సాంకేతిక లోపంతో బాయిలర్‌లో మంటలు చెలరేగినట్లు అరబిందో ఫార్మా సిబ్బంది భావిస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
