ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌ను అనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖలో లంచం తీసుకుంటు అధికారి పట్టుబడిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అంజనకు సంబంధించిన వాహన డ్రైవర్‌ సమీర్‌ హైమద్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

పెండింగ్‌లో ఉన్న 8 నెలల అద్దె వాహనం డబ్బులను చెల్లించాలని అడుగగా వాహనం అద్దె డబ్బులు చెల్లించాలంటే తనకు లంచం ఇవ్వాలని ఏవో శోభన్‌బాబు కోరినట్లు సమీర్‌ తెలిపాడు. డ్రైవర్‌ సమీర్‌ హైమద్‌ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌ వేసి హైమద్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏవోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.