సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి త‌న ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. వెంక‌ట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో సోమ‌వారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు వెంక‌ట్రామిరెడ్డి అంద‌జేశారు. అనంత‌రం వెంక‌ట్రామిరెడ్డి రాజీనామాను ప్ర‌భుత్వం ఆమోదించి, ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వెంక‌ట్రామిరెడ్డి స్వ‌స్థ‌లం పెద్ద‌ప‌ల్లి జిల్లా ఓదెల‌. 1991లో గ్రూప్‌-1 ఆఫీస‌ర్‌గా ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో వెంక‌ట్రామిరెడ్డి చేరారు. బంద‌ర్, చిత్తూరు, తిరుప‌తిలో ఆర్డీవోగా ప‌ని చేశారు. మెద‌క్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్ర‌ట‌రీ, జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా, సంగారెడ్డి, సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఏడేండ్లు జేసీగా, క‌లెక్ట‌ర్‌గా వెంక‌ట్రామిరెడ్డి ప‌ని చేశారు.