ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజర్‌ సస్పెన్షన్‌..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌, ఇన్‌చార్జి రేంజర్‌ సరోజన రాణిని సస్పెన్షన్‌ చేస్తూ ఆదిలాబాద్‌ సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినోద్‌ కుమార్‌ ఐఎఫ్‌ఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టేకు కలప, వెదురు అక్రమ రవాణా, నిలువ చేసిన విషయంలో ఉన్నతాధికారుల నివేదిక అనంతరం సస్పెన్షన్‌ చేసినట్లు వివరించారు. అటవీ సంరక్షణ, వన్య ప్రాణుల ఆవాస పరిరక్షణలో జరిగిన అవకతవకలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ చేసినట్లు పేర్కొన్నారు.