తెలంగాణ రాష్ట్రానికి మరో 12 మంది ఐపీఎస్‌లు

తెలంగాణలో ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్‌క్యాడర్‌ పోలీస్‌ అధికారులకు దాదాపు 12 మందికి పదోన్నతులు కల్పించి ఐపీఎస్‌ క్యాడర్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు వారం కింద కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నిర్వహించిన డీపీసీ ఆమోదించినట్టు అదికారవర్గాలు తెలిపాయి. త్వరలో కేంద్ర హోంశాఖ దీనిపై ఆదేశాలు ఇవ్వనున్నది.