కలుషిత నీరు తాగిన బీసీ హాస్టల్‌ విద్యార్థులు.. నీలోఫర్‌ హాస్పిటల్‌కు తరలింపు

హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడంతో 15 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విద్యార్థులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. అటునుంచి నాంపల్లిలోని నీలోఫర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా హాస్టల్‌లో తాగడానికి మంచినీరు లేకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థలకు గురయ్యారు. హాస్టల్ వార్డెన్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.