
టీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. తాజాగా కరీంనగర్ కార్పొరేషన్‌ను కూడా దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇందులో 34 డివిజన్లలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ 12, ఎంఐఎం 6 డివిజన్లలో గెలుపొందగా, ఇతరులు 8 డివిజన్లలో విజయం సాధించారు. 60 డివిజన్లలో 20, 37వ డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 58 డివిజన్లకు ఈ నెల 24న ఎన్నికలు జరిగాయి. సోమవారం ఫలితాలు వెలువడ్డాయి.