టీఎన్‌పీసీబీ మాజీ చీఫ్ ఏవీ వెంక‌టాచ‌లం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

త‌మిళ‌నాడు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మ‌న్ ఏవీ వెంకటాచ‌లం వెల‌చేరిలోని త‌న నివాసంలో ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించడం క‌ల‌క‌లం రేపింది. గురువారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు భార్య మొద‌టి అంత‌స్తులోని ఆయ‌న రూంలోకి వెళ్ల‌గా వెంక‌టాచ‌లం ఉరికి వేలాడుతూ క‌నిపించాడు. న్యూ సెక్ర‌టేరియ‌ట్ కాల‌నీ రెండో వీధిలో వీరు నివ‌సిస్తున్నారు. ఘ‌ట‌నా స్ధ‌లంలో సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేద‌ని పోలీసులు తెలిపారు. సైబ‌ర్ విశ్లేష‌ణ కోసం వెంక‌టాచ‌లం మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏఐఏడీఎంకే ప్ర‌భుత్వం వెంక‌టాచ‌లాన్ని టీఎన్‌పీసీబీ చైర్మ‌న్‌గా 2019 సెప్టెంబ‌ర్‌లో నియ‌మించింది. సేలం జిల్లాకు చెందిన వెంక‌టాచ‌లం 2018 వ‌ర‌కూ భార‌త అట‌వీ స‌ర్వీసుల్లో ప‌నిచేశారు. గ‌తంలో వెంక‌టాచ‌లం టీఎన్‌పీసీబీ స‌భ్యకార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో నేర‌పూరిత ప్ర‌వ‌ర్త‌న‌, అవినీతి, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. సెప్టెంబ‌ర్ 24న వెంక‌టాచ‌లం నివాసంపై డీవీఏసీ అధికారులు దాడులు చేప‌ట్టి రూ 2.5 కోట్ల విలువైన బంగారం, రూ 2.5 కోట్ల న‌గ‌దునూ సీజ్ చేశారు.