విజిలెన్స్ మాజీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ నగరంలో హెచ్ఎండీఏకు చెందిన విజిలెన్స్ మాజీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. విజిలెన్స్ మాజీ అధికారి జగన్‌తో పాటు 10 ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ సోదాలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.