ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవలే మృతి చెందారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించి, మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్‌లో అధికారులు హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు.