అక్రిడేటెడ్ జర్నలిస్టుల బస్సు పాసుల గడువు మరో మూడు నెలలకు పొడిగించినట్టు టీఎ్‌సఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పాస్‌లు 2022మార్చి31 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా పునరుద్దరిస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బస్‌పాస్ కౌంటర్‌లలో పాత పాసులను అందచేసి కొత్తవి పొందవచ్చని వివరించారు.