కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మార్గదర్శకాలు విడుదల చేసిన పోలీసులు

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. వాహన డ్రైవర్లు ప్రయాణికుల బుకింగ్‌లను రద్దు చేస్తే . ఈ– చలాన్‌ రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్‌ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్‌ చేయాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు. మీడియం, గూడ్స్‌ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు.