ఈనెల 8 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేత

ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.