తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2983 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,206 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్-259,రంగారెడ్డి-227, హన్మకొండ-118, సంగారెడ్డి-96 కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,88,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 22,472 మంది కోవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,062కి చేరింది.