ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న రేఖారాణిని కాపు కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్‌ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్‌ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు.