31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, డాక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంగళవారం ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లెంల రవీందర్ కుమార్ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కోరారు. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ఈ సందర్భంగా సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ పర్విందర్ రాజు,ఎఎంవిఐ అమృత వర్షిణి, ఓజోన్ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు డాక్టర్ మార్కండేయులు,డాక్టర్ హారిక, జోసెఫ్,విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు