రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు హాజరయ్యారు. ఈ సహస్రాబ్ది వేడుకలు 12 రోజులపాటు సాగనున్నాయి. ఈ వేడుకలకు 7 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం చేశారు.