ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు ఐదో రోజుకు చేరుకున్నది. ఆదివారం.. తీవ్రవ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరగనుంది.
ఉత్సవాల్లో ప్రాధాన ఘట్టమైన సమతామూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు పులువురు ప్రముఖులు శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, జనసేన నేత పవన్ కల్యాణ్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు.