ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చినజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానని చినజీయర్ స్వామి తెలిపారు.
ప్రతీ పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ ఇవన్నీ ఉన్న వైఎస్ జగన్‌లో ఎలాంటి గర్వం లేదని చినజీయర్ స్వామి అన్నారు. వైఎస్ జగన్ అందరి సలహాలను స్వీకరిస్తారు.. సలహాలను పాటిస్తారు. వైస్ జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని చినజీయర్ స్వామి అన్నారు.