
చిత్తూరు జిల్లా పీలేరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కే.వి.పల్లికి చెందిన ఏపీటిడబ్ల్యూ గురుకుల బాలికల పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వై.బాలాజీ నాయుడు ఏసీబీకి పట్టుబడ్డారు. 4 నెలలు బిల్లులు రూ.5,15,000/- మరియు డిసెంబర్ బిల్లు రూ. రూ.1,37,000 పాస్ చేసినందుకు కాంట్రాక్టర్ దగ్గర రూ.2,00,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.