ఎమ్మెల్సీలుగా న‌లుగురు ప్ర‌మాణ‌స్వీకారం

స్థానిక సంస్థల శాస‌న‌మం‌డలి సభ్యు‌లుగా ఇటీ‌వల ఎన్ని‌కైన న‌లుగురు పోచం‌పల్లి శ్రీని‌వా‌స్‌‌రెడ్డి, టీ భాను‌ప్ర‌సాద్‌, ఎంసీ కోటి‌రెడ్డి, దండే విఠల్‌ సోమ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరి చేత మండ‌లి‌లోని తన చాంబ‌ర్‌లో చైర్మన్‌ ప్రొటెం సయ్యద్‌ అమి‌నుల్‌హస‌న్‌‌జాఫ్రీ ప్రమాణం చేయిం‌చారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌లుగురు ఎమ్మెల్సీల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.