ఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ట్రాన్స్ కో డీఈ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ట్రాన్స్ కో  డీఈ భద్రయ్య. ఆ తర్వాత భద్రయ్య ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.