తెలంగాణ‌లో ఏప్రిల్ 24 నుంచి పాఠశాల‌ల‌కు వేస‌వి సెల‌వులు

తెలంగాణ‌లోని అన్ని పాఠశాల‌ల‌కు ఏప్రిల్ 24 నుంచి వేస‌వి సెల‌వుల‌ను తెలంగాణ పాఠశాల‌ విద్యా శాఖ ప్ర‌క‌టించింది. అలాగే ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యా శాఖ మార్చింది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వ‌ర‌కు ఒకటో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్‌ల‌కు ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 23న ఫ‌లితాల విడుద‌ల‌, పేరెంట్స్ మీటింగ్, లాస్ట్ వ‌ర్కింగ్ డే ఉంటుంది. ఆ త‌ర్వాత ఏప్రిల్ 24 నుంచి పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు ఉంటాయి.

ఇదివ‌ర‌కు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16 వ‌ర‌కు ఒక‌టి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసినా.. తాజాగా కొత్త షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది.