పచ్చదనం మరింత పెంచుదాం : పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌

రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్‌మ్యాప్‌పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ అరణ్యభవన్‌లో నిర్వహించిన రెండురోజుల వర్‌షాప్‌ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ రక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే, క్షీణించిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. రాష్ట్రమంతటా మరింతగా పచ్చదనం పెంచడం అటవీశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మొదటి ప్రాధాన్యత కావాలని సూచించారు.