
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(29) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. సైనా నెహ్వాల్‌కు బీజేపీ జనరల్ సెక్రటరీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు. సైనాకు అరుణ్ సింగ్ సభ్యత్వ రసీదు ఇచ్చారు.