రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి గురువారం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రవిచంద్రను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి, శ్రీనివా్‌సగౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని తదితరులు అభినందించారు.
