తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ నూతన వెబ్‌సైట్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ కె తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌ లో కమిషన్‌ సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. అలాగే ఫిర్యాదులు కూడా చేేస అవకాశం ఉందని చెప్పారు. చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్లు, కేసీఆర్‌ కిట్‌లలో కలిగే ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకురావచ్చన్నారు.