రామగుండం ఎరువుల కర్మాగారానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్

రామగుండం ఎరువుల కర్మాగారానికి (Ramagundam Fertilizer Factory) పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్ ఇచ్చింది. నేటి నుంచి యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ నిబంధనలు పాటించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్యాస్ లీకేజీలతో స్థానికులు అస్వస్థతకు గురవుతున్నారు. యూరియా, అమ్మోనియా, డస్ట్ లీకేజ్‌లపై ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యం వ్యవహరించడంపై రామగుండం ఎమ్మెల్యే ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టింది.