ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రాష్ట్ర ప్రజ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లోని శాస్త్రిన‌గ‌ర్ ఉన్న తన క్యాంప్ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు.