ఏసీబీ వ‌ల‌లో మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ జూనియ‌ర్ అసిస్టెంట్‌

హైద‌రాబాద్‌లోని కోటిలోగ‌ల డైరెక్ట‌రేట్ ఆఫ్‌ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ జూనియ‌ర్ అసిస్టెంట్ జంగిటి జ‌య‌కుమార్‌ ఏసీబీ వ‌ల‌లో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అత‌డిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజ‌రుప‌రిచారు.

మెద‌క్ జిల్లా రుస్తుంపేట్ మండ‌లం రామ‌చంద్రాపూర్‌కు చెందిన త‌లారి కిష‌న్‌.. అత‌డి నాన్న‌కు సంబంధించిన మెడిక‌ల్ బిల్స్ రీయింబ‌ర్స్‌మెంట్ ప్రొసీడింగ్స్ కాపీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. వాటిని ఇచ్చేందుకు జూనియ‌ర్ అసిస్టెంట్ జంగిటి జ‌య‌కుమార్ రూ. 2,500 డిమాండ్ చేశాడు. దీంతో కిష‌న్‌.. ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. వారు ప‌థ‌కం ప‌న్ని కిష‌న్‌ నుంచి జ‌య‌కుమార్ రూ. 2,500 తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. కెమిక‌ల్ టెస్ట్‌లో ఆధారాలు రుజువు కావ‌డంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో స్పెష‌ల్ జ‌డ్జి ఎదుట హాజ‌రుప‌రిచారు. కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.