సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌.. ప్ర‌యాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబ‌ర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం అధికారుల‌ను సంప్ర‌దించాల్సిన నంబ‌ర్ 040-27786666. కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా యువ‌త నిర‌స‌న బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ప‌లు రైళ్ల‌కు యువ‌త నిప్పంటించారు. అగ్నిప‌థ్ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల‌కు వెళ్లాల్సిన 72 రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేశారు. 12 రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేశారు. మూడు రైళ్ల‌ను దారి మ‌ళ్లించారు.