గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్ మరియు మహిళా సిబ్బంది

ముఖ్యమంత్రి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి కమిషనర్ కి ట్యాగ్ చేసినందున ఈ రోజు గ్రీన్ చాలెంజ్ ఆఫ్ ఇండియా లో భాగంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్., కమిషనర్ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు వారితోపాటు మహిళా సిబ్బంది కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మనిషి పుట్టిన నుండి తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతాడు దానికి మూలాధారం చెట్టు ఒక మనిషి పుట్టిన నుండి చనిపోయే వరకు సుమారు మూడు చెట్లనుండి వచ్చే గాలి అవసరం ఉంటుంది ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది . ఇందులో భాగంగా తను ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి చాలెంజ్ ని ఇవ్వాల్సి ఉంటుంది . ఇదొక నిరంతర ఇదొక నిరంతర పక్రియని కమిషనర్ గారు అన్నారు. ఈ మొక్కను పెంచే బాధ్యత మూడు సంవత్సరాల కాలం పాటు తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తారని ఆయన అన్నారు . ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినటువంటి గ్రీన్ చాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని హరితహారం కార్యక్రమం లో భాగంగా గతంలో నుండి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటు కోవడం జరుగుతుందని అదేవిధంగా ఇతర జిల్లాల్లో , రాష్ట్ర , దేశవ్యాప్తంగా ఈ యొక్క చాలెంజ్ స్వీకరించే విధంగా పచ్చని చెట్లు పెంచే విధంగా ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని కమిషనర్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్, కరీంనగర్, కలెక్టర్ శశాంక ఐఏఎస్., కామారెడ్డి, ఎస్పీ ఎన్. శ్వేత ఐపీఎస్., నల్లగొండ జిల్లా డిఎఫ్ ఓ శాంతారామ్ ఐఎఫ్ఎస్., అధికారులకు గ్రీన్ చాలెంజ్ ఆఫ్ ఇండియా గురించి ట్యాగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ గ్రీన్ చాలెంజ్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ముందు ఇంకా విస్తరించి ప్రజలకు, భావిభారత పిల్లలకు పచ్చదనంపై అవగాహన కలిగే విధంగా చెట్లను పెంచేందుకు ప్రేరణ కలిగించేటట్లు ఉండబోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, సిసిఎస్ ఏసీపీ సురేందర్, ఏఓ అయ్యా వారయ్యా, ఎస్బి ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సిసిఆర్బి ఇన్స్ స్పెక్టర్ దయాకర్ రెడ్డి, ఆఫీస్ సూపరిండెంట్లు మోహన్ప, వెంకటేశం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు