గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మాజీ ఎంపీ సీతారాం నాయక్

ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో నాటే కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు ప్రేరణ పొంది గ్రీన్ ఛాలెంజ్ పేరుతో తెలంగాణలో మొక్కలు నాటి అడవులను పెంపొందించాలని గ్రీన్ చాలెంజ్ ని విసిరారు దీనికి చిన్నారుల నుండి పెద్దవాళ్లు సెలబ్రిటీస్ వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు స్వీకరించి మొక్కలు పెట్టడమే కాకుండా ఇతరులకు కూడా గ్రీన్ ఛాలెంజ్ విసిరినారు దీని వల్ల తెలంగాణలోని హరితహారం లో ఒక మణికంఠ గా నిలిచింది, మాజీ ఎంపీగా వృక్షశాస్త్ర ఉపన్యాసకునిగా మా ఎంపీ జోగినిపల్లి సంతోష్ విసిరినటువంటి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తెలంగాణ చౌరస్తా హన్మకొండ లోని నూతనంగా వేసిన బీట్ రోడ్ ప్రక్కన మా ఇంటి ముందే మూడు మొక్కలను ఈరోజు నాటడం జరిగింది. విశేషమేంటంటే నా చిన్న మనవరాలు విద్మహి కూడా మొక్కను నాటి మరియు మా పాత మిత్రుడు అయినటువంటి డాక్టర్ ముస్తఫా, డాక్టర్ సురేఖ మరియు కూడా డైరెక్టర్ చిర్ర రాజు, బిల్లా యాదగిరి కి ఈ గ్రీన్ చాలెంజ్ విసరడం జరిగింది.