జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) జేపీ కుమార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు (ACB Rides) కొనసాగుతున్నాయి. నిన్న రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కాడు. ఈ సోదాల్లో ఇప్పటికే దాదాపు రూ. 50 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. భార్య పేరుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. భార్య పేరుతో రియల్ ఎస్టేట్(Real Estate), కోల్డ్ స్టోరేజీ(Cold Storage), లగ్జరీ చీరల(Luxury Series) వ్యాపారం నిర్వహించినట్టు సోదాల్లో తెలిసింది. 8 చోట్ల జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అదుపులో కమిషనర్ పీఏ అంజన్నతో పాటు డ్రైవర్ యూసుఫ్ ఉన్నారు. కమిషనర్ బ్యాంకు లాకర్స్‌లో భారీగా నగదు, ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. గతంలో జేపీ కుమార్ ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేశాడు. ఆ సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
