వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ.
ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదని సీఎం జగన్ మండిపడ్డారు.. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏమాత్రం లేదని, పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానమన్నారు. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతమని, తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలనేది చంద్రబాబు అభిమతమని సీఎం జగన్ విమర్శించారు. నారాయణ, చైతన్యలను మాత్రమే టీడీపీ ప్రోత్సహిస్తుందన్న సీఎం జగన్.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను కార్పొరేట్ తీసుకెళ్లడానికి శ్రమిస్తోందని స్పష్టం చేశారు.
సుమారు 50 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగింది: సీఎం జగన్
వైఎస్‌ఆర్ చేయూత ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 9,180 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 12, 758 కోట్లు ఇచ్చాం మూడేళ్లలో వ్యవసాయం రంగంపై రూ. లక్షా 27వేల కోట్లు ఖర్చు చేశాం. ఆర్‌బీకేల ద్వారా రైతన్నల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.రైతులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం మనది ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశాం ఉచిత విద్యుత్ కోసం రూ. 27వేల కోట్లు ఖర్చు చేశాం సుమారు 50 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరిగింది. మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 23,875 కోట్లు ఇచ్చాం మూడేళ్లలో మ్యానిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం అక్కా చెల్లెమ్మల పేరుపైనే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పటివరకూ 31లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అందజేశాం: సీఎం జగన్
ఇది ఆత్మీయుల సునామీ: సీఎం జగన్
‘‘ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం: సీఎం జగన్
మేము మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది’ అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చెక్కుచెదరని అభిమానానికి కృతజ్ఞతలు
విజయవాడ-గుంటూరు మధ్య ఇవాళ ఓ సముద్రం కనిపిస్తోంది. వర్షం పడుతున్నా చెక్కుచెదరని అభిమానం కనిపిస్తోంది అంటూ సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ సమావేశాలకు హాజరైన జన సంద్రానికి అభివాదం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాజ్యాంగాన్ని సవరించింది పార్టీ ప్లీనరీ. తీర్మానాన్ని ఆమోదించింది.