తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఇదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహణ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీనే ఆఫీస్‌ బేరర్ల ఎన్నికను చేపట్టనున్నారు. 32 జిల్లాల్లో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 18 లక్షల 42 వేల 412 మంది ఓటు వేయనున్నారు.