భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాను ఉద్యోగం చేసే భద్రాచలం ప్రాంతంలో నివసించకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు నిర్వహిస్తూ విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు వేటు వేసినట్లు తెలిపారు.