ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం (Insurance Scheme) ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నలకు బీమా పథకం ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడన్నారు. ప్రమాదవశాత్తు నేత కార్మికులు మరణిస్తే రూ. 5 లక్షల బీమా పరిహారం వస్తుందన్నారు. నేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం (TRS Govt.) కట్టుబడి ఉందన్నారు. నేత కార్మికులకు బీమాతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. నేతన్నల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.