తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్పై ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి కేటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు తనిఖీ చేశారు. రెండు రోజుల పాటు ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. చేపట్టాల్సిన తనిఖీలపై జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా జిల్లా కలెక్టర్కు తనిఖీ నివేదిక అందించనున్నారు.