
బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండు రోజులపాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలైన చెక్కు క్లియరెన్స్, నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కానీ, ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమ యథాతథంగా పనిచేయనున్నాయి.