ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ

ఏసీబీ అధికారులకు స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ కుమారస్వామి పట్టుబడ్డాడు. లక్ష 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులకు ఆయన పట్టుబడ్డాడు. సుమంగళి ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీడీఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.